Site icon Bhakthi TV

త్రిమూర్తుల అంశాలతో అవతరించిన త్రిజగన్మాతలు..

భారతీయ పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. ఆనందాన్ని కలిగించి, ఆలోచనలను వికసింపజేసే ఈ పండుగలు కేవలం సాంప్రదాయ కర్మకాండలు కాదు, ధర్మ–మోక్ష సాధనాల మార్గాలు కూడా. “పండా ఆత్మ విషయా బుద్ధిః” అని గీతాభాష్యం. ఆత్మ విషయకమైన బుద్ధే నిజమైన పండగ. అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందించేది పండుగ. అలాంటి పండుగల్లో విజయానికీ, శౌర్యానికీ, శుభారంభానికి ప్రతీకగా నిలిచినది విజయదశమి. త్రిమూర్తుల అంశాలతో, త్రిజగన్మాతలైన సరస్వతి, లక్ష్మి, పార్వతుల తేజో విభవ సంపత్తితో ఆదిపరాశక్తి అవతరించింది.

మహావిష్ణువు ఆదేశానుసారం, మహామాయగా జగన్మాత అవతరించి మధు–కైటభులను సంహరించింది. మహిషాసురుణ్ణి వధించి మహిషాసురమర్దినిగా వెలుగొందింది. శుంభ–నిశుంభులను సంహరించి చాముండిగా పేరు పొందింది. రక్తబీజుని రక్తాన్ని నేలమీద పడనీయకుండా తాగి మహాకాళిగా అవతరించింది. కరువు, కాటకాలను నివారించి ప్రజలకు ఆహారం అందించి శాకంబరిగా వెలుగొందింది. అలా జగన్మాత రాక్షస సంహారం చేసి, ధర్మరాజ్యం స్థాపించి, భక్తులకు ఐహిక, ఆముష్మిక ఫలాలను అనుగ్రహించింది.

Share this post with your friends
Exit mobile version