Site icon Bhakthi TV

శ్రీరాములవారి సందేశాన్ని అందజేసిన భగవద్రామానుజులవారు

భగవద్రామానుజుల వారు శరీరం విడిచిపెట్టటానికి సిద్ధంగా ఉన్న తరుణంలో వారి శిష్యులు అందరూ వారిచుట్టూ చేరి చివరిమాట ఏదైనా చెప్పండి అని అడుగారు. అప్పుడు రామానుజులవారు.. “నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత శరణాగతి ద్వారా తప్పించి ఇతరత్రా మార్గాలు ద్వారా కూడా మోక్షం వస్తుందని ఎవరైనా చెబితే మీరు వారి మాటలు నమ్మవద్దు” అని చెప్పారు. శరణాగతిని మించినది లేదని ఆయన చెప్పకనే చెప్పారు.

‘‘నన్ను శరణాగతి వేడిన వారిని ఎప్పటికీ విడువను వారు ఎంతటి ప్రమాదకరమైన భయంకర పరిస్థితులలో ఉన్నా నన్ను నమ్మిన వారిని రక్షించడములోప్రాణత్యాగమైనా చేస్తాను గానీ వారి చేయి ఎన్నటికీ వదలను’’ అనేది శ్రీరాములవారి ప్రతిజ్ఞ. ‘నన్ను నమ్మి వచ్చిన వారికి ఒక తల్లి ఒడి ఎంతటి క్షేమకరమైనదిగా భావిస్తారో అలా కాపాడతాను’ అని శ్రీరాములవారు చేసిన ప్రతిజ్ఞ తెలిసిన శ్రీమద్రామానుజులవారు మన అందరిని.. రాముడికి చేరువ చెయ్యాలనే ఉద్దేశ్యంతో శరణాగతిని మాత్రమే నమ్ముకొండి అని మార్గము చూపారు.

Share this post with your friends
Exit mobile version