Site icon Bhakthi TV

Story Of Gautam Rishi And Ahalya : అహల్యపై అసూయతో రగిలిపోయిన ఋషి పత్నులు.. తర్వాతేం జరిగిందంటే..

మహారాష్ట్ర నాసిక్‌లోని త్రయంబకేశ్వర క్షేత్రం గురించి తెలుసుకుంటున్నాం కదా.. త్రిమూర్తులు ఒకే పానవట్టంపై కొలువుదీరడం ఇక్కడ ఒక విశేషమైతే.. ముగ్గురూ లింగాకారంలోనే దర్శనమివ్వడం మరో విశేషం. త్రిమూర్తులు ఒకేచోట దర్శనమిస్తారు కాబట్టే ఈ ఆలయానికి త్రయంబకేశ్వర క్షేత్రం అని పేరు వచ్చింది. ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. కొన్ని యుగాలకు పూర్వం నాసిక్ ప్రాంతంలో మహర్షులు నివసిస్తుండేవారట. ముఖ్యంగా గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడే నివసించేవారు. అప్పట్లో ఈ ప్రాంతమంతా తినడానికి తిండి లేక.. తాగేందుకు నీరు లేక కరువు కాటకాలతో అల్లాడేదట.

Story Of Gautam Rishi And Ahalya

ఆ సమయంలో గౌతమ మహర్షి దంపతులు నీటికోసం చాలా ఇబ్బంది పడేవారు. దీంతో గౌతముడు తన తపఃశక్తితో ఒక సరస్సును సృష్టించగా.. అహల్యతో పాటు మిగిలిన ఋషి పత్నులంతా కూడా ఈ సరస్సులోని నీటినే వాడుకునేవారట. అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో అహల్యపై మిగిలిన ఋషి పత్నులంతా అసూయా ద్వేషాలను పెంచుకున్నారట. దీంతో గౌతమ మహర్షి మాదిరిగానే సరస్సును సృష్టించాలని మిగిలిన వారంతా తమ భర్తలను పట్టుబట్టారట. దీంతో చేసేదేమీ లేక ఋషులందరూ కలిసి గణపతి కోసం తపస్సు చేశారు. గణపతి ప్రతక్ష్యమై ఏం వరం కావాలో కోరుకోమనగా వారు కోరిన వరం స్వామివారికే ఆశ్చర్యం కలిగించింది. ఇంతకీ ఏంటా వరం? మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version