Site icon Bhakthi TV

Ayyappa Pooja : పడగవిప్పి నిలుచున్న నాగుపాముకు ఓ వ్యక్తి పూజలు..

ప్రస్తుతం అంతా అయ్యప్ప స్వామివారి మాల వేసుకుంటున్నారు. తాజాగా ఒక ఆసక్తికర ఘటన జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో కార్తిక మాసం సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో ఒక అయ్యప్ప మాలధారుడు ఏకంగా నాగుపాముకే పూజలు నిర్వహించాడు. పెరంపేట రోడ్డులోని బాట గంగానమ్మ ఆలయం సమీపంలో వేప చెట్టు వద్ద నాగుపాము ప్రత్యక్షమైంది.

పడగవిప్పి నిలుచున్న నాగుపాముకు ఓ వ్యక్తి పూజలు..

నాగుపామును చూసిన మాలధారుడు ఎలాంటి భయమూ లేకుండా దానికి కేవలం రెండు అడుగుల దూరంలో కూర్చొని పూజలు నిర్వహించాడు. నాగుపాము సైతం పడగ విప్పి అలా ఉండిపోయింది. పూజ నిర్వహిస్తున్నంత సేపు కదల్లేదు. పసుపు, కుంకుమ చల్లి, నీళ్లతో అభిషేకించినా కూడా నాగుపాము బొమ్మలా అలా పడగ విప్పి నిలబడిపోయింది. కార్తిక మాసం.. పైగా మాలధారణ చేసిన వ్యక్తి పూజకు నాగేంద్రుడు అంతలా ఫిదా అయిపోయాడు. పూజ విషయం తెలుకుని స్థానికులు అక్కడకు వచ్చినా కూడా పాము ఏమాత్రం కదల్లేదు. ఎవ్వరికీ ఎలాంటి హానీ తలపెట్టలేదు. అంతా కూడా నాగుపాముకు దణ్ణం పెట్టుకున్నారు.

Share this post with your friends
Exit mobile version