Site icon Bhakthi TV

Yajnavalkya Jayanti : యాజ్ఞవల్క్యుని జన్మదినాన్ని జరుపుకునే హిందూ పండుగ

Yagnyavalkya Jayanti
Yagnyavalkya Jayanti
Yagnyavalkya Jayanti

యాజ్ఞవల్క్య (Yajnavalkya) జయంతి అనేది వేద ఋషి అయిన యాజ్ఞవల్క్యుని జన్మదినాన్ని జరుపుకునే హిందూ పండుగ. తెలుగు పంచాంగం ప్రకారం, ఇది సాధారణంగా కార్తిక శుద్ధ ఏకాదశి నాడు వస్తుంది. జ్ఞానం, పట్టుదల, మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఈ మహర్షిని భావిస్తారు. యాజ్ఞవల్క జయంతి, యాజ్ఞవల్క్య జన్మోత్సవం అని కూడా అంటారు. ఈ రోజున యాజ్ఞవల్క్యుడిని పూజిస్తారు. ఆయన కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసాలకు నిలువెత్తు నిదర్శనం.

బృహదారణ్యకోపనిషత్తు, శతపథ బ్రాహ్మణం, యాజ్ఞవల్క్య స్మృతి వంటి గ్రంథాలు ఆయన రచనలే. దక్షిణ భారతదేశంలో కార్తిక మాసంలో ఈ జయంతిని జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలోసాధారణంగా ఫాల్గుణ శుక్ల పంచమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. మీరు కూడా ఈరోజున యాజ్ఞవల్క్య మహర్షిని ఆరాధించి ఆయన అనుగ్రహానికి పాత్రులవ్వండి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను Subscribe చేయండి

Share this post with your friends
Exit mobile version