Site icon Bhakthi TV

Significance Of Pathalaganga : శ్రీశైల క్షేత్రంలో పాతాళగంగ విశిష్టత

శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిలో మనోహరగుండం ఒకటి. దీనిలో గొప్పతనం ఏమిటంటే.. ఈ గుండములో చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక శ్రీశైలం వెళ్లిన వారు తప్పనిసరిగా పంచ పాండవుల ఆలయాలను సైతం దర్శించుకోవాలి. పాండవులు మల్లికార్జునుని దర్శించుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారి పేరు మీదుగా ఐదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి వాటిలో శివలింగములను ప్రతిష్టించారని తెలుస్తోంది. కాబట్టి శ్రీశైలం వెళ్లిన వారు తప్పనిసరిగా ఈ పంచపాండవుల ఆలయాలను సైతం తప్పనిసరిగా దర్శించుకోవాలి.

Significance Of Pathalaganga

ఇక శ్రీశైలం ఆలయంలో వృద్ధ మల్లికార్జునుడు సైతం ఉన్నాడని తెలుసా? అయితే వృద్ద మల్లికార్జునుడు లింగ రూపంలోనే ఉన్నాడు. శివలింగం ముడతలు పడిన ముఖంలా ఉంటుంది. దీనిని సైతం తప్పకుండా దర్శించుకోవాలి. మరొక దర్శనీయ ప్రదేశం పాతాళగంగ. దీనిలోని నీరు నీలంగా కాకుండా పచ్చగా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందనడానికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. నీటి కింద బండలపై నాచు నిలుస్తుంది. ఈ నాచుపై సూర్య కిరణాల వెలుగు పడగానే ఆ నీరంతా పచ్చగా కనిపిస్తుందని అంటారు. అయితే అంతా నీటి కింద ఉన్న దాన్ని పచ్చల బండగా పిలుస్తారు.

Share this post with your friends
Exit mobile version