అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. అరుణాచల శివయ్యను నిత్యం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అందుకే ఈ శివయ్య పిలుపు కోసం ఎందరో భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. అరుణా చలం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది గిరి ప్రదక్షిణ. దాదాపుగా వెళ్లిన వారంతా మొత్తంగా 14 కిలో మీటర్ల పాటు గిరి ప్రదక్షిణ చేస్తారు. అయితే గిరి ప్రదక్షిణ చేసే సమయంలో భక్తులంతా ఒకరి దర్శనభాగ్యం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆమెను ముట్టుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రాలోని తిరువణ్ణామలై నగరంలో అరుణాచలం కొండ వద్ద శివుడు అగ్ని లింగం రూపంలో మనకు దర్శమిస్తాడు. పంచభూత లింగ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసే వారంతా మార్గంలో ఎక్కడో ఒకచోట టోపీ అమ్మ దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటారు. ఆమె కనిపిస్తే.. ఆమె చూపు తమపై పడాలని.. ఆమెను తాకాలని ప్రయత్నం చేస్తారు. ఆమె ఎదురుగా వస్తుందంటేనే అదొక అదృష్టంగా భావిస్తారు. ఈ టోపీ అమ్మ అసలు పేరు పళని. కన్యాకుమారికి చెందిన పళని అరుణాచలం ఎందుకు వచ్చిందనేది ఎవరికీ తెలియదు. అరుణాచలంలోనే ఉంటూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. నిత్యం శివ ధ్యానంలోనే ఉంటుందని చెబుతారు.
