Site icon Bhakthi TV

Ratha Sapthami : ఒకేరోజు ఏడు వాహనాలపై ఊరేగనున్న మలయప్పస్వామి… ఎందుకో తెలుసా?

ప్రత్యక్ష దైవం సూర్యుని జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోనుంది. మాఘ శుక్ల సప్తమి నాడు జరిగే రథసప్తమి సందర్భంగా మలయప్పస్వామి ఒక్కరోజే ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వడం ఈ పండుగ ప్రత్యేకత. సూర్యుడు లోకానికి వెలుగును, జ్ఞానాన్ని ప్రసాదించిన పవిత్ర దినమిదని వేదాలు చెబుతాయి. అందుకే స్వామి సూర్యప్రభ వాహనం నుంచి చంద్రప్రభ వాహనం వరకు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తుల పాపాలను హరించేందుకు బయలుదేరుతాడని భక్తుల విశ్వాసం. ఈ రోజు దర్శనం చేస్తే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. మినీ బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి వేళ తిరుమల కొండలు భక్తుల జయజయధ్వానాలతో మారుమోగుతాయి. స్వామివారి వాహన సేవలు చూసే ప్రతి క్షణం… హృదయాల్లో భక్తి దీపంలా వెలుగుతుంది.

Ratha Sapthami
Share this post with your friends
Exit mobile version