Site icon Bhakthi TV

నంది కొమ్ములలో విలువైన రత్నాలు.. వాటి కోసం దొంగలేంచేశారంటే..

పరమేశ్వరుడు దాదాపుగా అన్ని క్షేత్రాల్లోనూ లింగరూపంలోనే ఆవిర్భవించాడు. అలా శివయ్య కొలువుదీరిన ప్రతి చోట ఆయనకు ఎదురుగా నందీశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు.
అలా శివయ్యకు ఎదురుగా నందీశ్వరుడు కొలువుదీరిన క్షేత్రాల్లో అత్యంత ప్రాచీనమైనది గుంటూరు జిల్లాలోని ‘నందివెలుగు’ క్షేత్రం. ఈ ఆలయాన్ని కాలక్రమేణా చాళుక్యరాజు విష్ణువర్ధనుడు అభివృద్ధి చేశాడు. ఆ సమయంలో చాళుక్య రాజు శివలింగం ఎదురుగా నందీశ్వరుడినీ, గణపతిని ప్రతిష్టించాడట. అప్పుడు వినాయకుడి బొజ్జతో పాటు నంది కొమ్ములలోను విలువైన రత్నాలను ఉంచాడని చెబుతారు.

నంది కొమ్ములలో విలువైన రత్నాలు.. వాటి కోసం దొంగలేంచేశారంటే..

అప్పట్లో సూర్యోదయం సమయంలో సూర్యుడి కిరణాలు వినాయకుడి బొజ్జలో ముందుగా పడేవట. తద్వారా గణేశుడి బొజ్జలో గల రత్నాలపై పడి, ఆ కాంతి కిరణాలు నంది కొమ్ముల పైకి ప్రసరించాయని చెబుతారు. ఆ కిరణాలు నంది కొమ్ములలోని రత్నాలతో పరావర్తనం చెందిన కిరణాలు శివలింగంపై పడేవని చెబుతారు. అలా అను నిత్యం స్వామివారికి రత్నాల కిరణాలతో అభిషేకం, హారతి వంటివి జరిగేవట. ఒకసారి ఈ అద్భుతాన్ని కళ్లారా వీక్షించిన దోపిడీ దొంగలు ఆ రత్నాలను కాజేసేందుకు పన్నాగం పన్నారట. ఒకరోజు ఆలయంలోకి వెళ్లి వినాయకుడి బొజ్జలోని రత్నాలను, నంది కొమ్ములు విరిచి అక్కడి రత్నాలను దొంగిలించారట. అలా నందీశ్వరుడికి కొమ్ములు లేకుండా పోయాయి.

Share this post with your friends
Exit mobile version