పూర్వం దారుక అనే రాక్షసి ఉండేది. అవడానికి రాక్షసి అయినా కూడా ఆమె పార్వతీదేవికి పరమ భక్తురాలు. పశ్చిమ తీరంలో అమ్మవారి కోసం ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సును మెచ్చిన పార్వతీమాత ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగింది. దానికి దారుక తన భర్త దారుకుడికి ఎలాంటి ఆపదా రాకుండా వరం కోరుకోగా.. అమ్మవారు అనుగ్రహించింది. దీంతో ఇక తనకు మరణం లేదని తెలుసుకున్న దారుకుడు మానవులు, దేవతలన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టడం ఆరంభించాడు. రాక్షస దంపతుల ఆగడాలు భరించలేక భృగు మహర్షి కుమారుడు ఔర్వ హహర్షి దగ్గరకు దేవతలంతా కలిసి వెళ్లారు.
తమను దారుక దంపతుల అకృత్యాల నుంచి రక్షించమని కోరారు. అది విన్న ఔర్వుడు వెంటనే ఒక యజ్ఞం చేసి దాని నుంచి అమృతాన్ని సృష్టించి దేవతలకు ఇచ్చాడు. అది స్వీకరించిన దేవతలంతా దారుక రాక్షస సైన్యంపైకి యుద్ధానికి వెళ్లి వాళ్లందరినీ ఓడించారు అప్పుడు రాక్షసులంతా అక్కడి నుంచి పారిపోయి పశ్చిమ సముద్రంలోని ఒక ద్వీపంలో తలదాచుకున్నారు. అక్కడ కూడా ఆ ద్వీపం వైపుగా ప్రయాణించే వాళ్లను భక్షించడం ప్రారంభించారు. అంతటితో ఆగాడా? ఏకంగా శివ భక్తుడినే చెరసాలలో బంధించాడు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.
