నాలుకపై మచ్చలు ఉంటే మాటలకు శక్తి ఉంటుందన్న నమ్మకం మన సంస్కృతిలో పురాతనమైనది. పెద్దలు చెప్పినట్టు, పూర్వజన్మ సుకృతం ఉన్నవారికి వాక్‌శుద్ధి లభిస్తుందట. అంటే వారు మనస్ఫూర్తిగా పలికిన మాటల్లో దైవశక్తి ప్రవహిస్తుందన్న భావన. అందుకే అలాంటి వారు ఆశీర్వదిస్తే అది నిజమవుతుందని, అలాగే తొందరపడి చెడు మాటలు పలికితే అవి కూడా ఫలించవచ్చని చెబుతారు. సాముద్రిక శాస్త్రంలో నాలుక దిగువ భాగంలోని మచ్చలు కళాత్మకతకు, భోజన ప్రీతికి సూచనగా చెబుతారు. కానీ నాలుక ఎగువ భాగంలోని మచ్చలు మాటల విషయంలో జాగ్రత్త అవసరమని సూచిస్తాయంటారు. శాస్త్రీయంగా నిరూపణ లేకపోయినా, మన మాట దేవుడి వరమనే భావనతో మంచి మాటలే పలకాలి. ఎందుకంటే మాటే మంత్రం… మాటే మన భవిష్యత్తుకు బాట.

