Site icon Bhakthi TV

Mahalakshmi Yoga Benefits : జాతకంలో మహాలక్ష్మీ రాజయోగం ఎప్పుడు ఏర్పడుతుందో తెలుసా?

జాతకంలో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడితే అదృష్టం తలుపు తట్టినట్టేనని అని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. గ్రహాలు కేవలం ఆకాశంలో సంచరించే నక్షత్రాలు కాదు…. మన జీవిత పథాన్ని సూచించే దివ్య సంకేతాలు. చంద్రుడు మనసును, కుజుడు శక్తిని సూచిస్తారు. ఈ రెండూ శుభస్థానాల్లో కలిసినప్పుడు ధైర్యం, ధనం, దైవకృప ఒకేసారి కలిసివస్తాయని విశ్వాసం. ముఖ్యంగా రెండు, తొమ్మిది, పది లేదా పదకొండు స్థానాల్లో ఈ సంయోగం ఉంటే వ్యక్తి జీవితంలో ఆర్థిక స్థిరత్వం, ఆకస్మిక అవకాశాలు, సమాజంలో గౌరవం సహజంగా పెరుగుతాయి. అయితే ఈ యోగం ఉన్నవారికి కష్టాలు రావనే కాదు. కానీ ప్రతి సవాలు చివరికి విజయంగా మారుతుంది. లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు కాదు….మనసుకు తృప్తి, ఇంటికి ఆనందం, కృషికి ఫలితం లభిస్తాయి. ఈ రాజయోగం ఉన్నవారు సాధారణ మార్గంలోనే అసాధారణ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ధర్మబద్ధంగా సంపాదించిన ధనం దీర్ఘకాలం నిలుస్తుంది. అందుకే మహాలక్ష్మీ రాజయోగం అనేది కేవలం జాతకంలో ఉన్న రేఖ కాదు… దైవానుగ్రహం, శ్రమ, సద్గుణాలు కలిసినప్పుడు వికసించే ఐశ్వర్య యోగం అని చెప్పాలి.

Mahalakshmi Yoga Benefits
Share this post with your friends
Exit mobile version