
వారంలో ప్రతి రోజు ఒక గ్రహానికి అధిపతిగా ఉంటుంది. కాబట్టి వారాన్ని బట్టి ఆ గ్రహానికి సంబంధించిన రంగు దుస్తులు ధరించడం ద్వారా మన జీవితంలో మార్పులు సంభవిస్తాయట. తద్వారా సానుకూల శక్తిని, అదృష్టాన్ని ఆకర్షించవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఏ రోజున ఏ దుస్తులు ధరించాలో తెలుసుకుందామా? సోమవారం చంద్రుడికి అనుకూలం. శాంతి, స్వచ్ఛత, భావోద్వేగాలకు ప్రతీక అయిన చంద్రుడికి అనుకూలమైన రోజున వైట్, క్రీమ్, సిల్వర్ రంగు దుస్తులు దరించాలి. తద్వారా మనసు తేలికగా ఉంటుంది.
మంగళవారం అంగారకుడు పాలిస్తాడు. కాబట్టి మంగళవారం ఎరుపు, మెరూన్, కోరల్ రంగు దుస్తులు ధరిస్తే ధైర్యం, శక్తి పెరుగుతాయట. బుధవారం బుధుడు పాలిస్తాడు కాబట్టి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే మానసిక స్పష్టత, ఏకాగ్రత పెరుగుతాయట. గురువారం బృహస్పతి పాలిస్తాడు కాబట్టి పసుపు, నారింజ లేదంటే గోల్డ్ కలర్ దుస్తులు ధరించాలి. శుక్రవారం నాడు శుక్రుడు.. ఈ గ్రహం ప్రేమ, అందం, కళలకు ప్రతీక కాబట్టి పింక్, వైట్ లేదంటే లేత నీలం కలర్ దుస్తులు ధరించాలి. శనివారం శని గ్రహానిది కాబట్టి నలుపు, ముదురు నీలం లేదంటే ఊదా రంగు దుస్తులు ధరించాలి. ఆదివారం సూర్య భగవానుడిది కాబట్టి కాషాయం లేదంటే గోల్డ్ కలర్ దుస్తులు ధరించాలి.
