Site icon Bhakthi TV

వివాహం కాని వారు ఈ ఆలయంలో ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలట..

పళని వెళ్లలేని వారు తమిళనాడులోని కాళీపట్టి కందస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇలా చేస్తే పళని సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నట్టేనని అక్కడి వారి భావన. ఇక ఈ ఆలయాన్ని లక్ష్మణ్ గౌండర్ అనే మురుగన్ భక్తుడు నిర్మించాడని తెలుసుకున్నాం కదా. అతని సమాధి కూడా ఈ ఆలయానికి ఎదురుగానే ఉంటుంది. దీనిని కూడా ఆలయానికి వెళ్లిన భక్తులు దర్శించుకుంటారు. కాళీపట్టి కందస్వామి ఆలయంలో రెండు రకాల రథాలు ఉంటాయి. వాటిలో ఒక దానిని చిత్ర తేరుగానూ.. మరొక దానిని వినాయకతేరు గానూ పిలుస్తారు.

ప్రతి మంగళవారం కందస్వామి ఆలయంలో దీపోత్సవం నిర్వహిస్తారు. ఇది అత్యంత కన్నుల పండుగగా జరుగుతుంది. అలాగే ఏడాదికోసారి తమిళనాడులో నిర్వహించే తైపూసం పండుగను ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున పశువుల సంత జరుగుతుంది. ఈ పశువుల సంతలో చుట్టు పక్కల నుంచి అనేక గ్రామాల వారు తమ పశువులతో పాల్గొంటారు. దీనిని దేశంలోనే అతి పెద్ద వేడుకగా చెబుతారు. ఇక ఈ సంత మాఘమాసంలోనే జరగడం విశేషం. మాఘ మాసం బహుళ పాడ్యమి రోజు జరుగనుంది. ఇక వివాహం కాని వారు కాళీపట్టి కందస్వామి ఆలయంలో ప్రతి మంగళవారం నిర్వహించే దీపోత్సవంలో పాల్గొని దీపాలను వెలిగిస్తే వెంటనే వివాహం జరుగుతుందని నమ్మకం.

Share this post with your friends
Exit mobile version