Site icon Bhakthi TV

వేదాలలో శ్రీవేంకటేశ్వరస్వామిని గురించిన ప్రసక్తి ఉన్నదా?

శ్రీ వేంకటేశ్వరస్వామిని గురించిన ప్రసక్తి ఋగ్వేదంలో ఉన్నదని ఈ క్రింది మంత్రాన్ని ప్రమాణంగా ఉదాహరిస్తారు.

అరాయి కాణే వికటే గిరింగచ్ఛ సదాన్వే శిరింబిరస్య…

(ఋక్సంహిత 10-155-1)

దీని భావం ఏంటంటే.. “ఓ నిర్దనుడా ! (పరలోకజ్ఞానంలేని వాడా!) అంధుడా! (పరమార్థజ్ఞానం లేనివాడా!) క్లిష్టపరిస్థితి సంభవించినపుడు, దానవులు ఆక్రమించినప్పుడు (లౌకికవిషయాలు అననుకూలంగా మారినప్పుడు) శ్రీనివాసునికొండకు పొమ్ము” నిర్ధనులు, కష్టదశలో ఉన్నవారు శ్రీవేంకటేశ్వర స్వామిని ఆపదమ్రొక్కులవానిగా భావించి సేవించడం నేటికీ కలదు. పై మంత్రానికి సాయణ భాష్యంలో ఈ అర్ధం చెప్పబడలేదు. అయినా అతిపురాతన కాలం నుంచి ఈ అర్థాన్ని కొందరు అంగీకరించినారని భవిష్యోత్తర పురాణం నుండి తెలుస్తున్నది. ఆ పురాణంలో ఈ వేటమంత్రానికి వేంకటాద్రి పరంగా అర్థం అంగీ కరింపబడింది.

ఏవం శ్రీకృష్ణరూపేణ క్రీడితో వేంకటాచలే, అరాయికాణే వికటే గిరిం గచ్ఛేతి తం విదుః ఏవం వేదమయ స్సాక్షాత్ గిరీంద్రః పన్నగాచలః ఛన్న వల్మీక దేహాడ్యో వైకుంఠాదధికోహ్యభూత్.

Share this post with your friends
Exit mobile version