Site icon Bhakthi TV

Is Lord Hanuman Still Alive in the Himalayas : హనుమ ఇప్పటికీ అక్కడ తపస్సు చేస్తున్నాడట…యతుల రూపంలో వానరులు

హనుమ ఇప్పటికీ అక్కడ తపస్సు చేస్తున్నాడట..! #lordhanuman #hanuman #hanumanji #kondagattu #himalayas

హనుమంతుడు ఇప్పటికీ హిమాలయాల్లో తపస్సు చేస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి. రాముని వరం మేరకు ఆయన చిరంజీవిగా ఉండి భక్తులను సదా రక్షిస్తున్నాడు. మహాభారతం అరణ్యపర్వం ప్రకారం, భీముడు స్వర్ణ పుష్పాల కోసం అలకనంద నదీ తీరానికి వెళ్ళగా, గంధమాదన పర్వతంలో తపస్సు చేస్తున్న ఆంజనేయుడు కనిపిస్తాడు. హనుమయ్యను యధార్ధంగా గుర్తించలేని భీముడు అడ్డుతప్పుకోమని కోరతాడు. కానీ, తన తోకను పక్కకు జరిపి వెళ్లమనగా.. ఆ ప్రయత్నంలో భీముడు విఫలమౌతాడు. అసలు విషయం తెలుసుకొని పరిపరి విధాలుగా భీముడు స్తుతించగా… హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి కురుక్షేత్ర యుద్ధంలో సహాయం చేస్తానని మాట ఇస్తాడు. ఆ మాట ప్రకారమే కురుక్షేత్ర యుద్దంలో అర్జునుడి రథంపై కపిరాజుగా ఉంటూ దివ్యాస్త్రాలను అడ్డుకుంటాడు. భక్తికి కరిగిపోయే హనుమంతుడు శక్తికి ప్రతీక. చిరంజీవిగా హిమాలయాల్లో ఆయన తపస్సు చేస్తుండగా…వానరులు యతుల రూపంలో ఆయనకు సేవ చేస్తుంటారని, బదరీనాథ్‌లో స్వామి ఆలయం ఉన్న పర్వతానికి ఎదురుగా ఉన్న పర్వతాల్లో హనుమయ్య ఉంటారని చెబుతారు. యుగధర్మం ప్రకారమే ఎవరికీ కనిపించకుండా అదృశ్యంగా తపస్సు చేసుకుంటూ ఉంటాడని మహర్షులు, పెద్దలు చెబుతారు.

Is Lord Hanuman Still Alive in the Himalayas
Share this post with your friends
Exit mobile version