Site icon Bhakthi TV

కదంబ చెట్టు గురించి ఈ విషయాలు తెలిస్తే..

కదంబ చెట్టు గురించి హిందువులంతా వినే ఉంటారు. ఇది మన సంస్కృతి, పురాణాల పరంగానే కాకుండా వైద్య శాస్త్ర పరంగా కూడా ప్రత్యేక స్థానం కలిగింది. ఈ చెట్టు పువ్వులు చాలా ఆకట్టుకునేలా ఉంటాయి. పసుపు రంగుతో.. సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఈ వృక్షం భక్తి, ఆనందానికి, ప్రేమకి చిహ్నమని చెబుతారు. శ్రీ కృష్ణుడి రాసలీలకు ఇది సాక్షి అని కూడా చెబుతారు. కదంబ చెట్టున కదం లేదా బర్ పువ్వుల చెట్టుగా పిలుస్తుంటారు. ఈ బర్ పువ్వుల చెట్టు మన దేశంతో పాటు ఆగ్నేయాసియాలో అత్యంత వేగంగా పెరుగుతుంది.

ఈ చెట్టు గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ చెట్టు కిందే రాసలీలలు ఆడాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ చెట్టు రాధాకృష్ణుల కలయికకు చిహ్నంగా చెబుతారు. శ్రీకృష్ణుడికే కాకుండా దుర్గాదేవికి సైతం కదంబ తోటలు ఇష్టమని పురాతన సంస్కృత గ్రంథాలు చెబుతున్నాయి. ఈ చెట్టును తమిళులు అయితే తమ సంప్రదాయం ప్రకారం మురుగన్ స్వామితో ముడిపెడుతూ ఉంటారు. కదంబ చెట్టును జ్ఞానానికి ప్రతీకగా బౌద్ధ మతం చెబుతోంది.

Share this post with your friends
Exit mobile version