Site icon Bhakthi TV

How was Bhandasura born : భండాసురుడు ఎలా ఉద్భవించాడంటే..

భండాసురుడు ఎవరనేది ఇప్పుడు తెలుసుకున్నాం కదా. సతీదేవి దేవత్యాగం తరువాత పరమేశ్వరుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటుండగా.. తారకాసుర సంహారం చేయాల్సి ఉండటంతో ఆయన తపోభంగం చేయదలిచారు దేవతాలంతా. దీనికి కారణం.. పార్వతీపరమేశ్వరులకు జన్మించిన కుమారుని కారణంగానే తారకాసుర సంహారం జరగాల్సి ఉండటంతో మన్మథుడిని పంపించి శివుడిపై మన్మథ బాణం వేయించారు. శివుడు మూడో కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేశాడు. కొంతకాలం తర్వాత గణపతి ఆ భస్మాన్ని పోగుచేస్తుండగా.. దాని నుంచి భయంకర ఆకారంతో భండాసురుడు ఉద్భవించాడు.

How was Bhandasura born : భండాసురుడు ఎలా ఉద్భవించాడంటే..

భండాసురుడు పెరిగి పెద్దవాడైర మీదట ఘోరమైన తపస్సు చేసి శివకేశవులు సహా పురుషులు ఎవరి కారణంగా తనకు మరణం సంభవించకుండా వరం సంపాదించుకున్నాడు. దీనికి కారణం తనను స్త్రీలెవరూ సంహరించలేరనే భావన. ఇదే భండాసురుడి పాలిట శాపంగా మారింది. వర గర్వంతో ఏకంగా స్వర్గంపైనే భండాసురుడు దండెత్తాడు. దేవతలు, మునులు, సాధువులను పీడించడం ఆరంభించాడు. భండాసురుడి దురాగతాలను తట్టుకోలేకపోయిన దేవతలు తమ బాధలన్నీ బ్రహ్మదేవునికి చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించాడు. భండాసుర సంహారం ఒక మహాశక్తి కారణంగానే సంభవిస్తుందని వెల్లడించాడు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version