Site icon Bhakthi TV

సుముఖి దేవి, పూతనలు కన్నయ్యకు తల్లులుగా ఎలా మారారు?

సుముఖి దేవి: సందీపని ముని భార్య అయిన సుముఖి దేవికి కూడా తల్లి హోదా ఇచ్చాడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడు, బలరాముడు, సుదాముడు, సందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు. అయితే సుముఖి దేవి కృష్ణుడిని తన కుమారుడిగా ఉండేలా గురు దక్షిణ అడుగుతుంది. ఎందుకంటే ఆమె శంఖాసురుడి అధీనంలో ఉంటుంది.

మాధవుడు ఆమెను అతడి చెఱ నుంచి విడిపించిన కారణంగా పుత్ర సమానుడిగా చూసింది. అనంతరం గురుమాత కన్నయ్యను ఆశీర్వదించి నీ తల్లి నీకు ఎప్పుడూ దూరమవదని చెప్పింది. అందుకే కృష్ణుడు బతికినంత కాలం ఆయన తల్లి అయిన దేవకి కూడా జీవించే ఉంది.

పూతన: శ్రీ కృష్ణుడిని గోకులంలో హతమార్చేందుకు కంసుడు పూతన అనే రాక్షసిని పంపుతాడు. పాలు తాగే వయసులో ఉన్న కన్నయ్య వద్దకు పూతన వస్తుంది. తన రొమ్ముల్లో కాలకూట విషాన్ని నింపుకుని చిన్ని కృష్ణుడిని చంపాలని చూస్తుంది. అయితే పసిరూపంలో ఉన్న కన్నయ్య ఆ విషయాన్ని ముందే గ్రహించే పాలతో పాటు రొమ్ముల ద్వారా రక్తాన్ని పీల్చి ఆమెను హతమారుస్తాడు. పూతన మరణం తర్వాత అంతిమ సంస్కారాలు చేస్తున్న సందర్భంలో ఆమె శరీరం గంధపు చెక్కలా సువాసన వెదజల్లడం ప్రారంభించింది. ఆ సువాసన వాతవరణం అంతటా వ్యాపించింది. దీని వివరణ భాగవతంలో సమగ్రంగా పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత పూతనకు కృష్ణుడు తల్లి హోదా ఇచ్చాడు.

Share this post with your friends
Exit mobile version