Site icon Bhakthi TV

Gautama Maharshi Ashramam : గణపతి వరం ప్రభావంతో గౌతమ మహర్షి ఆశ్రమంలో ఏం జరిగిందంటే..

మహారాష్ట్ర నాసిక్‌లోని త్రయంబకేశ్వర క్షేత్రానికి సంబంధించిన కథ తెలుసుకుంటున్నాం కదా. గౌతమ మహర్షి సతీమణి అహల్యపై ఋషి పత్నులంతా అసూయ, ద్వేషాలతో రగిలిపోయారు. గౌతముని మాదిరిగానే సరస్సును సృష్టించాలని పట్టుబట్టగా.. వారంతా కలిసి గణపతి కోసం తపస్సు చేశారు. గణపతి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా.. వారంతా ఒక విస్తుబోయే వరం అడిగారు. అదేటంటే.. గౌతమ మహర్షి ఆశ్రమంలోని ఆవు మరణించేలా చేయమని ఋషులంతా ముక్తకంఠంతో కోరుకున్నారు. అది విని వినాయకుడు ఆశ్చర్యపోయాడు.

Gautama Maharshi Ashramam : గణపతి వరం ప్రభావంతో గౌతమ మహర్షి ఆశ్రమంలో ఏం జరిగిందంటే..

గోహత్య మహా పాపమని వారించ యత్నించాడు. కానీ ఋషులు ఎంత చెప్పినా వినలేదు. గణపతికి వరమిచ్చి వెళ్లిపోయాడు. ఆ తరువాత కొద్ది రోజులకు గౌతమ మహర్షి దర్భతో ఆవుని అదిలించగా అది మరణిస్తుంది. అప్పుడు ఋషులంతా గౌతముని వద్దకు వెళ్లి గోహత్య మహాపాపమంటూ భయపెట్టారు. దీనికి పరిష్కారంగా కలిసి గోహత్య మహాపాపం కాబట్టి పాప విమోచనం కోసం ఈ ప్రాంతంలో గంగానది ప్రవహించేలా చేయాలని చెప్పారు. అప్పుడు గౌతమ మహర్షి ఆలోచించి.. తన ధర్మపత్ని అహల్యతో కలిసి కొన్ని వేల సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version