Site icon Bhakthi TV

తలాతల, మహాతల, రసతల, పాతాళ లోకాలు ఎక్కడుంటాయంటే..

ఇప్పటికే మనం పాతాళంలోని ఏడు లోకాలలో.. మూడు లోకాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన నాలుగు లోకాలు.. తలాతల లోకం, మహాతల లోకం, రసాతల లోకం, పాతాళ లోకాల గురించి తెలుసుకుందాం.

తలాతల-లోకం: ఇది అన్నింటిలోకి 11వ లోకం.. భూమి తర్వాత 4వ లోకం. మాయాసురుడు ఇక్కడ శ్రీ హరి అనుగ్రహంతో మహా రుద్రుని రక్షణలో నివసిస్తున్నాడని చెబుతారు. మాయాసురుడు పాండవుల మయసభ సహా అనేక అద్భుతమైన భవనాలు నిర్మించాడు.

మహాతల-లోకం: ఇది అన్నింటిలోకి 12వది.. అలాగే భూమి తర్వాత 5వది. ఇక్కడ నాగులు నివసిస్తాయని చెబుతారు. కాళియ, తక్షక, సుసేన మొదలైన నాగులన్నీ ఇక్కడే నివసిస్తాయట. ఈ నాగులన్నీ గరుడికి భయపడుతూ నిత్యం ఆగ్రహంతో ఉన్నా కూడా ఆనందంగానే నివసిస్తారట.

రసాతల-లోకం: ఇది అన్నింటిలోకి 13వది.. భూమి తర్వాత 6వది. ఇక్కడ దితి కుమారులు (రాక్షసులు) తమ కుటుంబాలతో నివసిస్తారట. ఈ లోకంలో నివసించే శ్రీహరి భక్తులకు.. సహ దైత్యులకు కూడా వారు భయపడతారని చెబుతారు.

పాతాళ-లోకం: అన్నింటి కంటే దిగువన ఉన్న లోకమే పాతాళ లోకం. వాసుకి, కాళికే, ధనంజయుడు మొదలైన నాగులు ఇక్కడ నివసిస్తున్నారని చెబుతారు. ఈ లోకం చాలా ప్రకాశవంతంగా ఉంటుందని చెబుతారు. దీనికి కారణం నాగుపాములకు ఫణి ఉండటమేనట.

Share this post with your friends
Exit mobile version