Site icon Bhakthi TV

స్వర్గం, నరకం ఎక్కడుంటాయో తెలుసా?

మనం చేసే ప్రతి పని మనకు ఏదో ఒక సత్యాన్ని తెలియజేస్తూనే ఉంటుంది. కానీ దానిని మనమే అర్థం చేసుకోం. తప్పును అర్థం చేసుకుని సరిదిద్దుకున్న రోజే పతనానికి దూరంగా, విజయానికి దగ్గరగా నడవగలుగుతామని పెద్దలు చెబుతారు. స్వర్గం, నరకం చచ్చాక ఎక్కడో ఉంటాయనుకుంటారు చాలా మంది. కానీ అవి ఎక్కడో కాదు.. బతికుండగానే భూలోకంలోనే ఉన్నాయి. ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా నీ పని నువ్వు చేసుకుంటే ఆ రాత్రి హాయిగా నిద్రపోతావు – అదే స్వర్గం. కానీ ఎవర్నైనా ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తే ఆ ఆలోచనే నిన్ను నిద్రలోనూ తినేస్తుంది – అదే నరకమని పెద్దలు చెబుతారు.

మొండితనం సాధించడంలో ఉండాలి, వాదించడంలో కాదు. అవసరంతో వచ్చే పొగడ్తకు, అభిమానంతో వచ్చే పొగడ్తకు తేడా తెలుసుకోకుండా పొంగిపోతే ఆడించేవారు ఎక్కువ అవుతారు. మనము నడుస్తూ పడిపోతే, ఎవరూ చూడకముందే లేచి నిలబడాలి. కానీ జీవితంలో పడిపోతే అందరూ చూస్తూ ఉండగానే లేచి నిలబడాలి. చిన్నప్పుడు నిద్రలేవడానికి కష్టపడతాం. బాధ్యతలు వచ్చాక నిద్రపోవడానికీ కష్టపడతాం. ఇంతే మరి జీవితం అంటే. ఇలా నిత్య జీవితంలో మనం ఆలోచించని విషయాలు చాలా ఉంటాయి.

Share this post with your friends
Exit mobile version