Site icon Bhakthi TV

కాకి సూర్యోదయాన ఇంటి ముందు అరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

హిందువులు చెట్లను, పుట్లను.. జంతువులు, పక్షులను సైతం పూజిస్తుంటారు. అయితే కాకులను మాత్రం అశుభంగా భావిస్తూ ఉంటారు. ఇవి వాస్తవానికి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కాకి అరవడం వలన ఇంటికి బంధువులు వస్తారని నమ్ముతారు. కొందరేమో కాకి అరుపును అశుభంగా భావిస్తారు. అసలు కాకి అరవడం మంచిదా? లేదంటే చెడా? తెలుసుకుందాం. ముఖ్యంగా కాకులు సూర్యోదయ సమయంలో ఇంటి ముందు అరిస్తే మంచిదట. జీవితంలో ఆర్థిక వృద్ధికి అది సూచన అని పండితులు చెబుతున్నారు. అలా కాకుండా రోజంతా ఇంటి ముందు అరుస్తూనే ఉంటే దానిని సంక్షోభానికి సంకేతంగా భావిస్తారు.

అలాగే కాకులు పదే పదే అరుస్తూ ఉంటే ఇంట్లో వివాదాలు, కలహాలు, గొడవలు తప్పవని అంటారు. దీని వలన ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, విభేదాలు పెరగచ్చని శకున శాస్త్రం చెబుతోంది. అయితే కాకి అరిస్తే అతిథులు ఇంటికి వస్తారని కూడా చెప్పుకున్నాం కదా.. ఇది జరిగితే మాత్రం కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయట. ఈ రకంగా చూస్తే మంచిదే. ఏది ఏమైనా కాకులు పదే పదే అరవకుండా.. సూర్యోదయ సమయాన్నో లేదంటే ఎప్పుడైనా ఒకసారి అరిస్తే మంచిదే. పదే పదే అరిస్తేనే సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

Share this post with your friends
Exit mobile version