
హిరణ్యశిపుని పంపకం: ఈ కోవలోని ఒకరు చాలా మొండివారు. చాలామంది వారు తమ మాటే ‘వేదం’ ఇంట్లో! అందరూ వినితీరాలి అని శాసిస్తారు. ఇంట్లో వారికి సొంత అభిప్రాయాలు ఉంటాయని, ‘ జ్ఞానం’ వీరికి ఉండదు. చివరికి పిల్లలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఏ పాఠశాలలో చదవాలి? ఏ గ్రూపు తీసుకోవాలి? కూడా వీరే నిర్ణయిస్తారు. కుమారుడు ప్రహ్లాదునికి తనను మాత్రమే పూజించమని ఎన్ని హింసలు పెట్టాడో! అంత ఇబ్బంది పెట్టే మాటలు అంటారు. నేను ఇంటి పెద్దని నేను సంపాదిస్తున్నాను. ఇంట్లో ఉండాలనుకుంటే ఉండండి! లేదా పొండి! అనే ‘స్టేట్ మెంట్ ‘ ఎక్కువ ఇస్తారు. అక్కడ పెరిగిన పిల్లలు సమాజానికి సమస్య కా మారుతారు ఇంట్లో వారి మీద కోపాన్ని బయటి వారి మీద ప్రదర్శించి చల్లబడతారు చివరికి వాళ్లు మరో ‘హిరణ్యకశిపుడు’ అవటం ఖాయం.
సోక్రటీస్ పెంపకం: సోక్రటీస్ గొప్పతత్వవేత్త అందరికీ బుద్ధులు, సుద్దులు, చెప్పేవాడు కానీ భార్యతో సరిపడేది కాదు. భార్య’ సోక్రటీస్’ అని తిట్టనే రోజు లేదట, ఒకసారి తిట్టి తిట్టి అలిసిపోయి బకెట్ నీళ్ళు అతని నెత్తిమీద పోసిందట. అది చూసిన శిష్యులతో సోక్రటీస్ ‘ఉరుముల’ తర్వాత ‘వర్షం ‘ కురవటం సహజమే కదా! అని చమత్కరించాడు. పిల్లల ముందే పేరెంట్స్ పోటాడుకుంటారు. తండ్రి కొడుకుని తిడుతుంటే తల్లి అడ్డు వచ్చి, కొడుకుని సమర్థించడం. అలాగే తల్లి- కూతుర్ని మందలిస్తుంటే ! తండ్రి అడ్డుపడటం పిల్లలకు తల్లిదండ్రులతో ఒకరి పట్ల ‘నిర్లక్ష్య భావం’ ఏర్పడుతుంది. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక తమకి మంచి బుద్ధులు, నేర్పించాలని మందలించే వారితో కూడా శత్రుత్వం పెంచుకుంటారు. పొగిడిన వాళ్ళని ఆత్మీయులనుకుంటారు.
గోడమీద పిల్లి పెంపకం: ఈ పిల్లి ఎటు దూకుతుందో దానికి తెలియదు అన్నట్లుగా కొంత మంది తల్లిదండ్రులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు తెలియదు. ఒకసారి అభినందనలు అందుకున్న కొడుకు మర్నాడు అదే పనికి చివాట్లు అందుకుంటాడు. ఇలాంటి పిల్లలు గందరగోళంలో పడతాడు. అలాగే నిజం మాట్లాడాలని పదే పదే చెప్పే తండ్రి తనకు ఎవరైనా ఫోను చేస్తే! లేనని అబద్ధం చెప్పమంటాడు. పిల్లలను గౌరవించాలని బుద్ధులు చెప్పే తల్లి తన అత్తమామల విషయంలో అలా గౌరవించకపోవడం బిడ్డని సందిగ్ధత లో పడవేస్తుంది. ఇటువంటి వాతావరణం లో పెరిగిన పిల్లలు ‘స్వయంగా ఏ నిర్ణయం తీసుకోలేరు. పెద్దయ్యాక మానసిక సంఘర్షణలకు లోనయ్యే ప్రమాదం ఉంది.
