Site icon Bhakthi TV

Divine trees : దేవతా వృక్షాలని వేటిని పిలుస్తారు?

హిందూ సంప్రదాయాల్లో ప్రకృతిని దైవ స్వరూపంగా భావిస్తారు. ఈ క్రమంలోనే చెట్లను దైవ స్వరూపాలుగా భావించి పూజించే సంప్రదాయం కూడా ఉంది. ముఖ్యంగా కొన్ని తిథులు, కొన్ని పవిత్రమైన మాసాల్లో వివిధ రకాల దేవతా వృక్షాలను పూజించుకుంటూ ఉంటాం. ఇలా చేయడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తుందనేది హిందువుల విశ్వాసం. ఈ క్రమంలోనే కొన్ని చెట్లను పూజించడం వలన మనకేమైనా గ్రహదోషాల వంటివి ఉంటే అవి కూడా తొలగిపోతాయని చెబుతారు. మన పెద్దలు ఏర్పాటు చేసిన ఈ ఆచారాల వెనుక పర్యావరణ పరిరక్షణ అనే రహస్యం ఇమిడి ఉంది.

Divine trees

ఈ క్రమంలోనే పవిత్రమైన కార్తిక మాసంలో ఎలాంటి చెట్లను పూజించాలి? దానివల్ల కలిగే ఫలితాలు ఏంటనేది తెలుసుకుందాం. దేవతా వృక్షాలు కూడా ఉంటాయి. అవేంటంటే.. మన పురాణాల ప్రకారం కొన్ని రకాల చెట్లను దేవతా వృక్షాలుగా పిలుస్తారు. ఆ చెట్లకు అనారోగ్యాన్ని దూరం చేసే అద్భుతమైన శక్తి ఉండటం వలన ఆ పేరు వచ్చిందని చెబుతారు. అవేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. తులసి, రావిచెట్టు, శమీవృక్షం, అశోక వృక్షం, మర్రి చెట్టు, ఉసిరి చెట్టు, దేవదారు వృక్షం, పారిజాత వృక్షం, సంతాన వృక్షం, కల్పవృక్షంలను దేవతా వృక్షాలని పురాణాలు చెబుతున్నాయి.

Share this post with your friends
Exit mobile version