Site icon Bhakthi TV

Best Shiva Temples in Telugu States : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు ఇవే…

కార్తిక మాసంలో దీపాలను వెలిగించడం ప్రధాన ఆచారం. ఇంట్లో, దేవాలయాల్లో, నదుల ఒడ్డున దీపాలు వెలిగించడం వల్ల పాపాలు తొలగి, శ్రేయస్సు కలుగుతుంది. తులసి కోట వద్ద దీపం వెలిగించడం చాలా పవిత్రమైనది… అటువంటి పవిత్ర మాసం లో మనం వెళ్ళవలసిన కొన్ని ముఖ్యమైన దైవ క్షేత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు ఇవే…

మనకు మొదటగా గురుతుకొచ్చేది శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ఆలయం కార్తిక మాసంలో అత్యంత రద్దీగా ఉంటుంది.

Best Shiva Temples South India : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు ఇవే…

హైదరాబాద్ కు సమీపంలో ఉన్న కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం.. ఈ పుణ్యక్షేత్రంలో శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

కర్నూలు వాసులు ఈ కార్తిక మాసంలో వెళ్లే పుణ్యక్షేత్రం సంగమేశ్వర ఆలయం. ఈ ఆలయం కర్నూలు జిల్లాలో తుంగభద్ర, భవనాశి నదుల సంగమం వద్ద ఉన్న పురాతన ఆలయం.

నల్గొండ జిల్లా వాసులు నిత్యం దర్శించుకునే పుణ్యక్షేత్రం ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే… ఈ ఆలయంలో శివలింగంపై ఎల్లప్పుడూ ఒక నీడ ఉంటుంది.

ఇవే కాకుండా మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా కొన్ని ప్రముకమైన దేవాలయాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

మురుడేశ్వర ఆలయం… ప్రపంచంలోనే రెండో అతిపెద్ద శివ విగ్రహం ఇక్కడ ఉంది. అరేబియా సముద్ర తీరంలో ఉండే ఈ ఆలయం కార్తిక మాసంలో దర్శనీయం.

కోటిలింగేశ్వర ఆలయం… కర్ణాటకలోని ఈ ఆలయంలో అత్యధిక శివలింగాలు ఉన్నాయి.

Share this post with your friends
Exit mobile version