Site icon Bhakthi TV

మాఘమాసంలో ఆచరించే సత్యవ్రతం గురించి తెలుసా?

మాఘ మాసం ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన మాసం కావడంతో ఈ మాసంలో మనసును, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. ఒంటిపూట భోజనం చేయడంతో పాటు తినే దానిలో కొంత భాగాన్ని బలి ప్రీతి కోసం విడిచి పెట్టాలి. ముఖ్యంగా ఈ మాసంలో నువ్వుల భక్షణం, అరిటాకులో భోజనం చేయడం చాలా మంచిది. ఈ మాసంలో సత్యవ్రతాన్ని కొందరు ఆచరిస్తూ ఉంటారు. సత్యవ్రతమంటే మరేదో కాదు.. అబద్ధం ఆడకుండా సత్యాన్నే పలుకుతూ ఉండటం. ఈ మాసంలో సత్యవ్రతాన్ని ఆచరిస్తే సత్యలోకానికి చేరుతారట.

బ్రహ్మాండ పురాణం ప్రకారం.. సత్యవ్రతాన్ని ఆచరిస్తూ అబద్ధాలు ఆడరాదు. ధర్మాన్నే ఆచరించాలి. అలాగే ఇతరులు నొచ్చుకునేలా, బాధపడేలా, ఒకరిని అవమానించేలా ప్రవర్తించరాదు. మాఘ మాసంలో ఫలానా తిథి మంచిది అనేం లేదు. అన్నీ శ్రేష్టమైనవే. మాఘ శుద్ధ విదియ రోజు బెల్లం, ఉప్పు దానం, మాఘ శుద్ధ తదియ రోజు పార్వతి పూజ, హర తృతీయ వ్రతం , మాఘ శుద్ధ చవితి రోజు వరద చతుర్థి పూజ, నాగ ప్రతిష్ఠ చేస్తారు. నాగ ప్రతిష్ట చేస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందట. ఇక మాఘ శుద్ధ ద్వాదశిని వరాహ ద్వాదశిగా జరుపుకుంటాం. మాఘ శుద్ధ త్రయోదశి విశ్వకర్మ జయంతిగా జరుపుకుంటాం.

Share this post with your friends
Exit mobile version