Site icon Bhakthi TV

పిల్లల పెంపకంలో ఇన్ని రకాలా? కారాగార, విశ్వామిత్ర పెంపకం గురించి తెలుసా?

అవిశ్రాంతిగా ఉరుకులు, పరుగుల జీవితంలో తల్లిదండ్రులకు పిల్లల పెంపకం అనేది అతి పెద్ద సమస్య. అసలు పిల్లల పెంపకంలో ఎన్ని రకాలున్నాయో తెలుసా? ఏడు రకాలున్నాయి. వాటిలో ముందుగా రెండు రకాల గురించి తెలుసుకుందాం.

కారాగార పెంపకం: తిండి బట్ట నీడలకు కొదవ ఉండదు. కానీ సామాజికంగా స్వాతంత్ర్యం ఉండదు. పిల్లలతో తల్లిదండ్రులు తక్కువగా మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో తప్పు చేస్తే! మాట్లాడటం మానేస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు, చేస్తే! పిల్లలు మరీ మొండికెత్తే ప్రమాదం ఉంది. పిల్లలు ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో చేయకూడదు పెద్దలే! నిర్ణయిస్తారు. ఈ వాతావరణంలో పెరిగిన పిల్లలు ఉద్యోగంలో రాణించలేరు. “నాయకత్వ లక్షణాలు” వారిలో లోపిస్తాయి.

విశ్వామిత్ర పెంపకం: పిల్లలని భయభక్తులతో ఉంచటం తప్పు కాదు. ‘భయపెట్టే తత్వం’ మంచిది కాదు తల్లిదండ్రులకు కోపం ఎక్కువ ఉంటుంది. కనుక క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని దండించటం, జరుగుతుంది. వారికి ఎప్పుడు కోపం వస్తుందో? ఎందుకు వస్తుందో? కూడా వారికే తెలియదు. అకస్మాత్తుగా ఏదో విషయంలో విరుచుకు పడతారు ఇటువంటి కుటుంబాలు పెరిగిన పిల్లలకు పాజిటివ్ ఎమోషన్స్ తెలియవు. అన్నీ నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి అవి కోపం, ఆవేశం, ఉక్రోషం, ద్వేషం, పగ, ప్రతీకారం వీరి వలన సమాజంలో చాలా ప్రమాదం.

Share this post with your friends
Exit mobile version