తిరుమల యాత్రలో చాలా మందికి తెలియని ఒక ఆధ్యాత్మిక రహస్యం స్వామి పుష్కరిణిలోని 8వ మెట్టు. అలిపిరి నుంచి ప్రారంభమైన పాదయాత్ర కేవలం నడక కాదు…మన శరీరం, మనస్సు, ఆత్మను శుద్ధి చేసే సాధన. ఒక్కో మెట్టు ఎక్కే కొద్దీ మనలోని అహంకారం తగ్గి భక్తి పెరుగుతుంది. కొండపైకి చేరుకున్నాక పుష్కరిణిలో స్నానం తప్పక చేయాలంటారు. తిరుమల పుష్కరిణిలోని 8వ మెట్టును అష్టమ సోపానం అని చెబుతారు. జ్యోతిష్యంలో 8వ స్థానం శనికి సంబంధించినది. శని దోషాలు, పనులలో ఆలస్యం, అడ్డంకులతో ఇబ్బందులు పడుతున్నవారు ఈ మెట్టు దగ్గర క్షణం నిశ్శబ్దంగా నిలబడి ప్రార్థిస్తే అంతరంగంలో ఒక విశేషమైన స్థిరత్వం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇది మూఢనమ్మకం కాదు….మనసును స్థిరపరిచి, శ్వాసను సరిచేసి, భగవంతుడిని స్మరించిన మరుక్షణమే మార్పులు ప్రారంభమౌతాయి. ఇక పుష్కరిణిలోని నీటిని ప్రోక్షణ చేస్తూ శ్రద్ధగా ప్రార్థిస్తే భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. సమస్యలన్నింటికీ ఒక్కసారిగా పరిష్కారం రాకపోయినా, వాటిని ఎదుర్కొనే శక్తి మాత్రం లభిస్తుంది.
