Site icon Bhakthi TV

ఆ కత్తి కుంభకర్ణుడు వాడినదా? నిజమేనా?

తాజాగా రావణుని సోదరుడు కుంభకర్ణుడు వాడిన కత్తి తవ్వకాల్లో బయటపడిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడమే. నిపుణుల పరిశోధనలో తవ్వకాలలో కత్తి దొరికిందని.. అది రామాయణం కాలం నాటిదని.. అది కూడా కుంభకర్ణుడు వాడినదని చెబుతున్నారు. ఏఐ వచ్చిన తర్వాత డీప్ ఫేక్ వీడియోల బెడద బాగా పెరిగిపోయింది. ఏది నిజం? ఏది అబద్ధం అనేది తెలుసుకోవడం కష్టమే. ఇప్పటి వరకూ సినీ స్టార్స్‌కు సంబంధించిన వీడియోలను మాత్రమే డీప్ ఫేక్ చేసి వదిలారు. ఇప్పుడు దానిని పురాణాల వరకూ విస్తరించారు.

ప్రస్తుతం ఏఐని..ఆధునిక బ్రహ్మగా నేటి ప్రపంచం అభివర్ణిస్తోంది. దీనికి కారణం పున:సృష్టి. ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో చచ్చినవాళ్లను బతికించడం.. వారితో మాట్లాడించడం.. వృద్ధాప్యంలో ఎలా ఉంటామనేది ముందుగానే చూసుకోవడం.. ఇలా రకరకాల విన్యాసాలు ఏఐ సాయంతో చేస్తున్నారు. తవ్వకాల్లో ఒక పెద్ద కత్తి బయటపడితే వెంటనే పురావస్తు శాఖ ఎప్పటిది ఏంటనే వివరాలను వెల్లడిస్తుంది. అయితే ఆ కత్తి ఫలానా వ్యక్తి వాడిందని చెప్పడం మాత్రం కష్టం. అయితే వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలను నిపుణులు పరిశీలించగా అవి ఏఐ సాయంతో రూపొందించినవని తేలింది.

Share this post with your friends
Exit mobile version