Site icon Bhakthi TV

తిరుమలలో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని తిరుమలలోనూ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తం 34 మంది భక్తులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అశ్విని ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమ కుమారి, డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ సుబ్బారెడ్డి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శోభారాణి, హెడ్ నర్స్ శ్రీమతి సావిత్రి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పాఠశాలలలో ఈ నెల 16 నుండి 19 వరకు 8, 9,10 తరగతుల విద్యార్థిని విద్యార్థులకు జరుగనున్న సద్గమయ శిక్షణ తరగతులు వాయిదా పడ్డాయి. టీటీడీ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు కోసం చేపట్టిన సద్గమయ శిక్షణ తరగతులు పరిపాలనా పరమైన కారణాలు మూలంగా వాయిదా వేసినట్లు డిపిపి కార్యదర్శి శ్రీ శ్రీరాం రఘునాథ్ వెల్లడించారు. తదుపరి శిక్షణ తరగతుల తేదీలను ప్రకటిస్తామన్నారు.

Share this post with your friends
Exit mobile version