Site icon Bhakthi TV

దుర్గమ్మ మోముపై ఆ గుర్తెందుకు?

దేశం మొత్తం నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భక్తులు దుర్గాదేవిని వివిధ రూపాల్లో ఈ నవరాత్రుల్లో పూజించుకుంటున్నారు. దుర్గమ్మను చూడగానే ముందుగా అమ్మవారి రూపాన్ని చూస్తాం. ఆ తరువాత అమ్మవారి చేతిలోని ఆయుధాలు, పక్కన సింహం వంటి వాటిని గుర్తిస్తాం. అయితే అమ్మవారి నుదుటిని గమనిస్తే.. సాలీడు ఆకారపు గుర్తు కనిపిస్తుంది. అది చాలామందిలో ఆసక్తిని కలిగిస్తుంది. అది మనకు చూడగానే అదేదో సాధారణ గుర్తులా అనిపిస్తుంది. కానీ అది సాధారణ గుర్తుగా భావించకూడదట.

వాస్తవానికి అమ్మవారి నుదిటిపై సాలీడు ఆకారపు గుర్తు వెనుక ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉందని చెబుతారు. కేవలం అలంకారానికే ఈ గుర్తు కాదు. శాశ్వతమైన జీవన వలయాన్ని ఈ గుర్తు సూచిస్తుందని చెబుతారు. అంతేకాకుండా సాలీడు తన గూడును ఎలాగైతే సంక్లిష్టంగా అల్లుతుందో.. అలాగే సృష్టి, స్థితి, లయ అనే ఉనికి చక్రాన్ని అల్లుతుందట. దుర్గమ్మ ప్రతి అలంకరణ వెనుక ఒక ముఖ్యమైన సందేశం ఉందనేది వాస్తవమని పండితులు చెబుతారు. సాలీడు గుర్తు అనేది అమ్మ అనంతమైన సహనానికి సంకేతమట.

Share this post with your friends
Exit mobile version