
పైడితల్లి గజపతుల వారి ఆడపడుచు అని ముందుగానే తెలుసుకున్నాం కదా. విజయనగరం రాజు.. బొబ్బిలి రాజుకు మధ్య అప్పట్లో పెద్ద యుద్ధం జరిగిందట. ఆ సమయంలో రామరాజు సోదరి పైడిమాంబ మసూచి వ్యాధితో బాధపడుతోందట. ఒకరోజు పైడిమాంబ పూజలో ఉండగా తన సోదరుడిని తాండ్ర పాపా రాయుడు.. యుద్ధంలో విజయ రామరాజును సంహరించాడని తెలిసిందట. సోదరుడి మరణ వార్త తెలుసుకున్న పైడిమాంబ దు:ఖంతో తనువు చాలించిందట.
పైడిమాంబ మరణానంతరం ఆ రాజ్యంలో పతివాడ అప్పలనాయుడనే సైనికుడికి కలలో కనిపించి ఓ సందేశాన్ని అందించిందట.
పైడిమాంబ మరణానంతరం ఆ రాజ్యంలో ఒక సైనికుడైన పతివాడ అప్పల నాయుడుకి కలలో కనిపించి ఓ సందేశం అందించిందట. అదేంటంటే.. ఆ ప్రాంతంలోని ఓ సరస్సులో తన విగ్రహం ఉందని.. పడమర వైపు నుంచి వెతికితే అది దొరుకుతుందని చెప్పిందట. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించమని చెప్పింది. పైడితల్లి చెప్పిన ప్రకారమే చెరువులో వెదకగా.. విగ్రహం లభించిందట. దానిని తీసుకొచ్చి ఓ చోట ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో నిత్య పూజలు నాటి నుంచి ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ప్రతి ఏటా ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
