Site icon Bhakthi TV

బాబాగా మారిన అభయ్ సింగ్ ఎవరు?

మహాకుంభమేళాలో అభయ్ సింగ్ అనే బాబా గురించి తెలుసుకున్నాం కదా. ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివాడట. ఇంతకీ ఎవరీ అజయ్ సింగ్? ఆమనెందుకు అలా బాబాగా మారాడో తెలుసుకుందాం. అభయ్ సింగ్‌ది హర్యానా. ఒక రకంగా ఐఐటీ జాబ్ అంటేనే టెన్షన్ జీవితం. నిత్యం సంఘర్షణలతో గడపాల్సిందే. మరోవైపు వచ్చే జీతంతో లగ్జరీ లైఫ్ గడపొచ్చు. కాబట్టి దాని కోసం ఎంతటి టెన్షన్‌ను అయినా భరిస్తారు. కానీ అభయ్ సింగ్ అలా కాదు. ఆధునిక జీవితానికి స్వస్తి పలికి ఆధ్యాత్మికతకు చేరువయ్యాడు. పైగా ఇదే అత్యుత్తమ దశ అని చెబుతున్నాడు.

టెకీ బాబా ఫోటోగ్రఫీ, ఆర్ట్స్ ప‌ట్ల ఫోక‌స్ పెట్టడానికి ముందు బాంబేలో నాలుగేళ్ల పాటు చదువుకున్నాడు. అంతేకాదు.. క్యాంపస్ సెలక్షన్స్‌లో జాబ్ కూడా సంపాదించాడు. కార్పొరేట్ కొలువు.. దానికి తగిన జీతం. కానీ ఏదో అసంతృప్తి. అందుకే జాబ్ వదిలేసి సన్యాసం స్వీకరించాడు. వాస్తవానికి ఐఐటీలో చదివే సమయంలోనే ఫిలాసఫీ వైపు మొగ్గు చూపాడట. నిత్యం శివారాధనలో గడిపేవాడట. ఇప్పుడు ఆధ్యాత్మిక‌త‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఇంగ్లీష్‌లో చెబుతున్నాడు. ఆసక్తికరంగా అభయ్ సింగ్ సైన్స్ ద్వారా ఆధ్యాత్మిక‌త‌ను అర్థం చేసున్నాడట. మొత్తానికి అజయ్ సింగ్ చివరకు ఆధ్యాత్మికతకే ఓటేశాడు.

Share this post with your friends
Exit mobile version