Site icon Bhakthi TV

విష్ణుమూర్తి కూర్మావతారంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఎక్కడుందంటే..

శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చిందో తెలుసుకున్నాం కదా. క్షీరసాగర మథనంలో ఎన్నో అద్బుతాలు జరిగాయి. ఎందరో ఉద్భవించారు. వారిలో శ్రీ మహాలక్ష్మీదేవి ఒకరు. ఆ తరువాత శ్రీమహావిష్ణువు.. లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. కూర్మ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని వైష్ణవాలయాలలో ప్రత్యేక పూజలు, వేడుకలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కూర్మ జయంతి నాడు సాయంకాల సమయంలో దేవాలయాలను సందర్శించి పూజలు నిర్వహిస్తారు. ఇక కూర్మావతారంలో విష్ణుమూర్తి దర్శనమిచ్చే ఆలయం దేశంలో ఒక్కటంటే ఒక్కటే ఉంది.

ఆ ఒక్క దేవాలయం కూడా ఆంద్రప్రదేశ్‌లో ఉండటం విశేషం. ఏపీలోని శ్రీకాకుళం పట్ణానికి 15 కి.మీ. దూరంలో ఈ పుణ్య క్షేత్రం ఉంది. ఇక్కడ శ్రీమహావిష్ణువు కూర్మావతార రూపంలో పూజలందుకుంటాడు. శ్రీ కూర్మంకు చాలా ప్రత్యేకత ఉంది. దేశ కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే. కూర్మ జయంతి రోజు ఈ ఆలయానికి చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ మందిరం శిల్పకళాశైలి చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడి స్వామివారు పడమటి ముఖంగా ఉంటారు. మరొక విశేషం ఏంటంటే.. ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు ఉంటాయి. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు కూడా ఇక్కడ లభించాయి.

Share this post with your friends
Exit mobile version