Site icon Bhakthi TV

త్రిరాత్ర వ్రత దీక్షను ఎప్పుడు స్వీకరిస్తారు?

నేటి నుంచి ‘దేవి త్రిరాత్ర వ్రతం’ ప్రారంభమైందని తెలుసుకున్నాం కదా. తొమ్మిది రోజుల పాటు వ్రతం పాటించలేనివారు. కేవలం సప్తమి, అష్టమి, నవమి తిథులలో దీక్ష తీసుకుంటారు. దీనినే త్రిరాత్ర వ్రతదీక్ష అంటారు. కొంతమంది వ్రతంలో భాగంగా బొమ్మల కొలువు పెట్టి, పిల్లలకు పప్పు బెల్లాలు, శనగ గుగ్గిళ్లు పంచుతారు. ముతైదువులకు పసుపు-కుంకుమ, తాంబూలాలు ఇస్తారు. అలాగే కుంకుమార్చనలు, పుష్పాలంకరణలు, సుమంగళి వ్రతాలు అన్నీ ఈ ఉత్సవాల్లో భాగమై కన్నుల పండువ చేస్తాయి.

దుర్గాష్టమి – మహాష్టమి..

అష్టమి తిథి మొత్తం ఉంటే దానిని దుర్గాష్టమి. అష్టమి ముగిసి, అదే రోజున నవమి వస్తే దానిని మహాష్టమి అంటారు. ఈ రోజు తల్లిని సహస్రనామాలతో, కుంకుమార్చనలతో ఆరాధిస్తే సత్సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే లలితా సహస్రనామం పఠిస్తే, ఎలాంటి భయాలు దగ్గరపడవు. మహానవమి నాడు మంత్రసిద్ధి జరుగుతుంది. దీనినే సిద్ధిదా అంటారు. ప్రాచీన కాలంలో రాజులు ఈ రోజున ఆయుధపూజ చేసుకుని జైత్రయాత్రలకు బయలుదేరేవారు. అలవాటుగా ఈ ఆచారం ఇప్పటికీ వాహన పూజ రూపంలో కొనసాగుతోంది.

విజయదశమి – శమీ పూజ..

దశమి నాడు శమీ పూజ (జమ్మిచెట్టు పూజ) చేస్తారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్తూ ఆయుధాలు జమ్మిచెట్టు తొర్రలో దాచారని ప్రచారం ఉంది. ఆ రోజు ఆయుధాలు, వాహనాలు, యంత్రాలను అమ్మకు అర్పించి పూజిస్తే శత్రు పీడ తొలగిపోతుంది, విజయం లభిస్తుంది. ఈ విధంగా త్రిరాత్ర వ్రతదీక్ష ఆచరించిన వారికి సర్వ కోరికలు సిద్ధించి, సుఖసమృద్ధులు కలుగుతాయి.

Share this post with your friends
Exit mobile version