Site icon Bhakthi TV

శారదీయ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం.. ఘట స్థాపన ఏ తేదీన చేయాలి?

దాదాపుగా అన్ని మాసాలకూ సనాతన ధర్మంలో ప్రాధాన్యత ఉంటుంది. అయితే కొన్ని మాసాలకు కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కువ ప్రాధాన్యత ఉన్న మాసాల్లో ఆశ్వయుజ మాసం కూడా ఒకటి. ఈ మాసం దుర్గాదేవికి అంకితం చేయబడింది. శుక్లపక్షంలో శారదీయ నవరాత్రులను జరుపుకుంటారు. ఈ సమయంలో దుర్గాదేవితో పాటు ఆమె రూపాలైన నవ దుర్గలను పూజిస్తారు. ముఖ్యంగా శారదీయ నవరాత్రులలో దుర్గాదేవిని ఆరాధిస్తే అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందట. జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నింటి నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు.

ఈ ఏడాది దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయంలో కొందరికి చిన్న కన్ఫ్యూజన్ ఉంది. శారదీయ నవరాత్రులను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలో ప్రతిపాద తిథి నుంచి నవమి తిథి వరకూ జరుపుకుంటారు. వేద క్యాలెండర్ ప్రకారం శారదీయ మాసంలోని శుక్ల పక్షంలోని ప్రతిపాద తిథి సెప్టెంబర్ 22 సోమవారం ప్రారంభమై.. ప్రతిపాద తిథి సెప్టెంబర్ 23న ముగుస్తుంది. అంటే ప్రతిపాద తిథి సెప్టెంబర్ 22న తెల్లవారుజామున 01:23 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 23న తెల్లవారుజామున 02:55 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం సెప్టెంబర్ 22నే శారదీయ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కాబ్టటి ఈ రోజునే ఘటస్థాపన చేయాల్సి ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version