Site icon Bhakthi TV

బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం ప్రాధాన్యత ఏంటి?

భూలోక వైకుంఠంగా పేరొందిన కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేడు (సెప్టెంబర్ 24) అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి సాయంత్రం ధ్వజారోహణం కార్యక్రమాన్ని అర్చకులు, వేదపండితులు నిర్వహించనున్నారు. అసలేంటి ధ్వజారోహణం? ఈ కార్యక్రమంలో భాగంగా ఏం చేస్తారు? అంటే.. దేవతలకు ఆహ్వానం పలికే అత్యంత పవిత్రమైన కార్యక్రమమే ధ్వజారోహణం. శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి పెద్ద శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు. ధ్వజారోహణం అంటే ఏమిటో తెలుసుకుందాం.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను శాస్త్రోక్తంగా ఆహ్వానించడమే ధ్వజారోహణం. దీనిని ఎలా చేస్తారంటే.. శ్రీనివాసుడిని సాక్షాత్తు వైకుంఠనాథుడిగా పేర్కొంటారు. ఈ క్రమంలోనే శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడుని బొమ్మ దానిపై చిత్రకరీస్తారు. దీనిని గరుడ ధ్వజ పటంగా పిలుస్తారు. నూలుతో చేసిన కొడితాడుతో దీనిని ధ్వజస్తంభంపై కడతారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత భోగ శ్రీనివాసుడి ఉత్సవమూర్తుల సమక్షంలో మీన లగ్నంలో పైకి ఎగురవేస్తారు. ముక్కోటి దేవతలతో పాటు భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు ఈ ధ్వజస్తంభంపై ఎగిరే గరుడ పతాకమే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రంగా పేర్కొంటారు.

Share this post with your friends
Exit mobile version