Site icon Bhakthi TV

శ్రీ లలితా దేవి చరిత్ర ఏంటంటే..

లలితా దేవిని త్రిశక్తి సమాహారంగా పిలుస్తారు. ఆ త్రిశక్తులు ఏంటంటే..

ఇఛ్ఛాశక్తి: వామాదేవి (బ్రహ్మ దేవేరి)
జ్ఞానశక్తి: జ్యేష్ఠా (విష్ణు దేవేరి)
క్రియాశక్తి: రౌద్రి (శివ దేవేరి)
శ్రీ లలితా చరిత్ర ఏంటంటే..

అగస్త్య మహర్షికి హయగ్రీవుడు బోధించిన తత్వరహస్యం: భుక్తి, ముక్తి, దేవతలకు శక్తి ప్రసాదించేది లలితా పరాశక్తే. భండాసురుని సంహరించేందుకు యాగాగ్నిలోంచి అవతరించింది. ఉదయించే వెయ్యి సూర్యుల్లాంటి కాంతితో ప్రకాశించింది.

లలితా కృపా ప్రసాదం..

లలితా నామస్మరణం చేసిన వారి ఇంట శుభాలు నిండుతాయి. దేవీ భాగవతం, లలితోపాఖ్యానం పఠనం ద్వారా అమ్మ కటాక్షం తప్పక లభిస్తుంది. సువాసినులు కుంకుమార్చన చేస్తే మాంగల్య సౌభాగ్యం లభిస్తుంది.

ఈ రోజున సుహాసిని పూజ చేస్తారనిచెప్పుకున్నాం కదా. ఆ పూజ చేస్తే వచ్చే ఫలితం ఏంటంటే.. ముందుగా లలితా దేవి అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారి దయతో పూజ చేసుకున్న వారి వంశంలోనే ఎలాంటి వైధవ్య బాధలూ ఉండవట. లలితా దేవి తనను కొలిచిన భక్తుల దారిద్ర్య బాధల నుంచి విముక్తి కలిగిస్తుందట. అంతేకాకుండా పంచమి నాడు ‘ఓం శ్రీ మాత్రేనమః’ అని వీలైనన్ని సార్లు జపించుకుంటే అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయట.

Share this post with your friends
Exit mobile version