
ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న నాగ వాసుకి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. సాగర మథనానికి, నాగ వాసుకి ఆలయానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమృతం కోసం దేవతలు, అసురులు అమృతం కోసం సాగరాన్ని చిలకాలని నిర్ణయించుకున్నప్పుడు మందర పర్వతం కవ్వంగా మారగా.. వాసుకి కవ్వం చుట్టూ తాడుగా మారింది. వాసుకిని ఒకవైపు దేవతలు, మరోవైపు అసురులు పట్టుకుని చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో ముందుగా కాలకూట విషం బయటకు రాగా దానిని శివుడు తన కంఠంలో దాచేశాడు. చివరకు అమృతం లభించింది.
ఆ సమయంలో వాసుకి శరీరానికి గాయాలయ్యాయి. ఆ గాయాల నుంచి ఉపశమనం కోసం వాసుకి భూమిపైకి వచ్చి పలు ప్రాంతాల్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలా వాసుకి ఏర్పాటు చేసుకున్న నివాసాలలో ప్రయాగ్‌రాజ్ కూడా ఒకటని చెబుతారు. నాగ వాసుకి ఆలయం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆలయ గోడలపై పురాణాలు, దేవతల అందమైన చిత్రాలతో భక్తులకు దైవిక అనుభవాన్ని అందిస్తాయి. ఆలయానికి సమీపంలో గంగానది.. ఇక ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలు చూడచక్కగా మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి.
