Site icon Bhakthi TV

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం

ప్రముఖ త్రిలింగ క్షేత్రమైన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి పాటుపడతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ తెలిపారు. కాళేశ్వరం ముక్తేశ్వర క్షేత్రంలో ఆదివారం జరిగిన మహా కుంభాభిషేక మహోత్సవం పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమానికి ముగ్గురు మంత్రులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కాళేశ్వరం అభివృద్ధికి తమ ప్రభుత్వం శాయశక్తుల పనిచేస్తుందన్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వ పథకాలపై మాట్లాడొద్దన్నారు.

మే నెలలో 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సరస్వతి నది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 25 కోట్లు మంజూరు చేసి వివిధ అసంపూర్తిగా ఉన్న పనులతో పాటు నూతన పనులను ప్రారంభించి పనులు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ.. కాళేశ్వరంలో జరిగే పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు, మహిళలకు ఇబ్బంది లేకుండా బట్టలు మార్చుకొని గదులు, మరుగుదొడ్లు, వివిధ రకాల పనులు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం పుణ్యక్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోందని ఈ క్రమంలోనే ఇక్కడ నూతన మోడల్ బస్టాండ్ నిర్మించనున్నట్టు తెలిపారు. పుష్కరాల కోసం రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి కాళేశ్వరానికి బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు.

Share this post with your friends
Exit mobile version