Site icon Bhakthi TV

టీటీడీలో జరిగిన పలు అవకతవకలపై ఏసీబీ విచారణ కోరుతాం..

టీటీడీ గోశాలలో ఆల్ ఇండియా గోసంరక్షణ సంస్థ ప్రధాన కార్యదర్శి, టీటీడీ గోసంరక్షణ పూర్వ సభ్యులు శ్రీ కోటి శ్రీధర్ , టీటీడీ బోర్డు సభ్యులు, మీడియాతో కలిసి ఛైర్మన్ శనివారం పరిశీలించారు. అనంతరం టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జి. భాను ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ గోశాలలో గోవుల సహజ మరణాలపై అసత్య ప్రచారం చేసి, టీటీడీ ప్రతిష్టతను పలుచన చేస్తున్న టీటీడీ పూర్వ ఛైర్మన్ శ్రీ బి కరుణాకర్ రెడ్డి పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టామని, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. చట్టాలనుండి తప్పించుకోలేరని మాట్లాడారు.

టిటిడి గోశాలలో గత పాలకుల పాలనలో ఉన్న పూర్వ సంచాలకులు డాక్టర్ శ్రీ హరినాథ్ రెడ్డి పలు అక్రమాలకు పాల్పడ్డారని గతంలో గోశాల సంరక్షణ సభ్యులుగా పనిచేసిన శ్రీ కోటి శ్రీధర్ ఆరోపించారు. మందులు, గడ్డి, ఇతర రాష్ట్రాల నుండి గోవుల కొనుగోలులో భారీగా అవకతవకలు, గోవులు ప్రసవం అయ్యాక గోవులు ఏమయ్యాయో పూర్తి స్థాయిలో లెక్కలు లేవని ఆయన ఆరోపించారు. టీటీడీ గోశాలను వివాదం చేయవద్దని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డి, శ్రీ శాంతా రామ్, శ్రీ నరేష్ కుమార్, ఆల్ ఇండియా గోసంరక్షణ జనరల్ సెక్రటరీ శ్రీ కోటి శ్రీధర్ పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version