Site icon Bhakthi TV

శ్రీలంక చూడాలనుకుంటున్నారా? తక్కువ ధరలో లంకంతా చుట్టేయవచ్చిలా..

శ్రీలంక గురించి అందరికీ తెలిసిందే. రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు లంకలోనే బంధించాడు. ఈ ప్రదేశాలను చూడాలని చాలా మందికి ఉంటుంది. దీని కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమాన ప్యాకేజీని ప్రకటించింది. ట్రైల్ ఆఫ్ శ్రీలంక ప్యాకేజీగా దీనిని ఐఆర్‌సీటీసీ పేర్కొంటోంది. ఈ ప్యాకేజీలో భాగంగా.. శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు దంబుల్ల, కాండీ, నువారా ఎలియా, మునీశ్వరం ఆలయం, మనవారి ఆలయం, దంబుల్ల గుహ ఆలయం, శ్రీ లక్ష్మీ నారాయణ పెరుమాళ్ ఆలయం, శ్రీ భక్త హనుమాన్ ఆలయం, రాంబోడ సీతా అమ్మన్ ఆలయం, సీతా ఎలియా, అశోక వాటిక, పంచముగ ఆంజనేయర్ ఆలయం , కేలానియా బుద్ధ ఆలయాలను సందర్శించవచ్చు.

ఈ ట్రైల్ ఆఫ్ శ్రీలంక టూర్ ప్యాకేజీ ఆరు రోజుల పాటు సాగనుంది. తక్కువ ధరలో దాదాపు శ్రీలంకలో చూడాల్సిన ప్రదేశాలన్నింటినీ చూసి రావొచ్చు. ఈ టూర్ జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ టూర్ జూలై 3 వరకూ కొనసాగనుంది. వివరాల కోసం లేదా బుకింగ్ కోసం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లోని ఐఆర్‌సీటీసీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. లేదా www.irctctourism.com వెబ్‌సైట్‌లోకి కూడా లాగిన్ అవ్వవచ్చు.

ప్రయాణ టికెట్స్ ధరలు

సింగిల్ ఆక్యుపెన్సీకి ఒక వ్యక్తి ధర రూ. 89,845,

డబుల్ ఆక్యుపెన్సీ రూ. 69,450

ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ. 68,840

ప్యాకేజీలో భాగంగా అందించే సదుపాయాలు..

ఈ టూర్ విశాఖపట్నం నుంచి ప్రారంభం కానుంది. విశాఖ నుంచి కోలంబోకి.. తిరుగు ప్రయాణం కొలంబో నుంచి విశాఖకు ప్లైట్ టికెట్

సింగిల్, డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్ ప్రాతిపదికన త్రీ స్టార్ హోటల్‌లో హోటల్ వసతి సౌకర్యం

శ్రీలంకలోని దేవాలయాలు, స్మారక చిహ్నాలలో ప్రవేశ రుసుము వంటి సదుపాయాలు కల్పిస్తారు.

Share this post with your friends
Exit mobile version