Site icon Bhakthi TV

స్వామినారాయణ అక్షరధామ్ ఆలయంలో ‘విశ్వశాంతి మహాయజ్ఞం’

విజయదశమి సందర్భంగా ఆలయాలన్నింటిలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని స్వామినారాయణ అక్షరధామ్ ఆలయంలో ‘విశ్వశాంతి మహాయజ్ఞం’ను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ శాంతి కోరుతూ 114 యజ్ఞ కుండలిల పవిత్ర సమర్పణలు నిర్వహించారు. ఈ మహాయజ్ఞంలో మత పెద్దలతోపాటు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 900 జంటలు పాల్గొన్నారు. వేదపండితులు వారితో వేద మంత్రాలను పఠిస్తూ మహాయజ్ఞం నిర్వహించారు. వేద పండితులు, 900 జంటలతో సహా దాదాపు 2500 మంది ఈ యజ్ఞ కర్మలో పాల్గొన్నారు.

లోకంలోని వారందరికీ ఆయురారోగ్యాలు ప్రసాందించాలని.. సామరస్యాన్ని, విశ్వశాంతిని ప్రసాదించాలని.. అలాగే యుద్ధాలు.. సాయుధ పోరాటాల మధ్య ప్రపంచంలో శాంతియుత జీవనం కోసం వేద పండితులు పిలుపునిచ్చారు. భగవంతుడిని విశ్వశాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ యజ్ఞం నిర్వహించామని స్వామినారాయణ అక్షరధామ్ మందిర్ ఇన్‌ఛార్జి పూజ్య మునివత్సలదాస్ స్వామి తెలిపారు. అలాగే ఈ యజ్ఞం ప్రారంభంలో ప్రతిధ్వనించిన వేద మంత్రాలతో పాటు స్వామినారాయణ మహామంత్రం అన్ని కుటుంబాలకు సంతోషాన్ని ప్రసాదిస్తుందని మునివత్సలదాస్ తెలిపారు.

Share this post with your friends
Exit mobile version