Site icon Bhakthi TV

టీటీడీలో ఆన్ లైన్‌లో వాచీల ఈ – వేలం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి కానుకగా వచ్చిన వస్తువులను వేలం వేస్తారన్న విషయం తెలిసిందే. తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో కానుకగా వచ్చిన వస్తువులను ఒకేసారి వేలం వేస్తారు. వాటిని ఎప్పుడు వేలం వేస్తారు? ఎలా మనం కొనుగోలు చేయాలనే విషయాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడిస్తూ ఉంటుంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించిన / పాక్షికంగా దెబ్బతిన్న 62 లాట్ల వాచీల వేలానికి తేదీని టీటీడీ వెల్లడించింది.

జూన్ 02వ తేదీ నుంచి 03వ తేదీ వరకూ టీటీడీలో ఆన్‌లైన్ ద్వారా ఈ – వేలం వేయనున్నారు. వీటిలో టైటాన్, సిటిజెన్, సొనాటా, రాగ, టైమ్స్ వన్, టైమ్స్, టైమెక్స్ తదితర స్మార్ట్ వాచీలు EA ID Nos 25106, 25107, 25108, 25109 ద్వారా ఈ – వేలం వేయనున్నారు. ఆసక్తి కల్గిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ – కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన బిడ్డర్లు వాచీల వేలంలో పాల్గొనటానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ ( వేలములు) / ఏఈవో ( వేలములు), టీటీడీ, హరేకృష్ణ మార్గ్, తిరుపతిలో https://konugolu.ap.gov.in లేదా www.tirumala.org లేదా ఫోన్ నెంబర్ 0877 – 2264429 ద్వారా సంప్రదించగలరు.

Share this post with your friends
Exit mobile version