Site icon Bhakthi TV

పాట్నాలో టీటీడీ ఆలయం.. బిహార్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మించేందుకు బీహార్ ప్రభుత్వం అంగీకరించడంపై టీటీడీ ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పాట్నాలోని మోకామా ఖాస్ ప్రాంతంలో 10.11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రతయ అమృత్, ఐ.ఏ.ఎస్., ఈ మేరకు టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడుకు లేఖ రాశారు. సదరు స్థలంలో టీటీడీ ఆలయాన్ని నిర్మించేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాట్నాలో టిటిడి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించడంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హెచ్ ఆర్డీ మంత్రి నారా లోకేష్ అభినందించిందినట్లు ఛైర్మన్ తెలిపారు.

సదరు భూమిని 99 సంవత్సరాల పాటు రూ. 1 టోకెన్ లీజ్ రెంట్‌తో ఇవ్వాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీహార్ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టిటిడి ఆలయాన్ని నిర్మిస్తామని టీటీడీ ఛైర్మెన్ తెలిపారు. ఈ మహత్తరమైన నిర్ణయంతో బీహార్ రాష్ట్రంలో టీటీడీ ధార్మిక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఎంవోయూ చేసుకునేందుకు బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ ను అధికారికంగా నియమించిందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్‌తో టీటీడీ ప్రతినిధులు త్వరలో సంప్రదింపులు చేసి, టీటీడీ ఆలయ నిర్మాణానికి సంబంధించిన అవసరమైన అన్ని చర్యలు చేపడుతామన్నారు. బీహార్ ప్రభుత్వ సహకారం, దూరదృష్టికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Share this post with your friends
Exit mobile version