Site icon Bhakthi TV

శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రిపై టీటీడీ ఫోకస్

తిరుపతిలోని అలిపిరి జూపార్క్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను టీటీడీ జేఈవో శ్రీమతి గౌతమి మంగ‌ళ‌వారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, టీటీడీ ప్రతిష్టాత్మకంగా శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆరు అంతస్తులతో 50 వేల ఎస్ఎఫ్‌టీ విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. 2025 మార్చి నాటికి పనులు పూర్తి చేసేందుకు అదనంగా కార్మికులను ఏర్పాటు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

టీటీడీ ఆధ్వ‌ర్యంలోని శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల హృద‌యాల‌యం అద్భుత‌మైన సేవ‌లు అందిస్తోంద‌ని, ఎంతో మంది పేద‌లు మెరుగైన గుండె వైద్య‌సేవ‌లు పొందుతున్నార‌ని చెప్పారు. నూతనంగా నిర్మించే చిన్నపిల్లల ఆసుపత్రిలో ఆధునిక‌ వైద్య పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అంతకుముందు ఆసుపత్రి నిర్మాణ పనులపై జేఈవో, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తర్వాత జేఈవో ఆసుపత్రిలో జరుగుతున్న సివిల్, ఎలక్ట్రికల్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.

Share this post with your friends
Exit mobile version