Site icon Bhakthi TV

టీటీడీలో ప్రక్షాళన, వసతి గృహాల పేర్లు మార్పు..

తిరుమలలోని పలు వసతి గృహాలకు పేర్లను మార్చుతున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జే శ్యామలరావు వెల్లడించారు. అలాగే టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించినట్టు సైతం తెలిపారు. తిరుమ‌ల‌లోని 45 విశ్రాంత భ‌వ‌నాల పేర్లు మార్పున‌కు 75 ఆధ్యాత్మిక‌ పేర్ల‌ను టీటీడీ ఎంపిక చేసింది.ఇందులో 42 మంది టీటీడీ సూచించిన పేర్ల‌ను మార్పు చేశారు. ఇదివ‌ర‌కే 33 కాటేజీలకు వివిధ దేవ‌త‌ల పేర్లు క‌లిగిఉన్నాయి. మిగిలిన రెండు విశ్రాంతి గృహాలు స్పందించ‌లేదు.దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్ల‌ను టీటీడీనే మార్పు చేసేందుకు, ఇండియ‌న్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విష‌యంలో వారితో చ‌ర్చించేందుకు బోర్డు నిర్ణ‌యించింది.

అలాగే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఆదేశాల మేర‌కు టీటీడీలో ప్ర‌క్షాళ‌న చేప‌ట్టినట్టు టీటీడీ ఈవో వెల్లడించారు. భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం, వ‌స‌తి, అన్న‌ప్ర‌సాదాలు, ల‌డ్డూ ప్ర‌సాదంలో స‌మూల మార్పులు తీసుకొచ్చామన్నారు. తిరుమ‌ల అట‌వీ ప్రాంతంలో 68 శాతం నుండి 80 శాతానికి ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించేంద‌కు చ‌ర్య‌లు చేప‌ట్టామన్నారు. ఈ క్రమంలోనే టీటీడీ తీసుకున్న విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం ప్ర‌కారం అన్య‌మ‌త‌స్తుల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టామన్నారు. ఇప్ప‌టికే టీటీడీలో ఉన్న 29 మంది అన్య‌మ‌త ఉద్యోగుల‌కు స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ ఇచ్చేందుకు టీటీడీ బోర్డు కూడా ఆమోదం తెలిపిందని ఈవో వెల్లడించారు.

Share this post with your friends
Exit mobile version