Site icon Bhakthi TV

భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్

శ్రీ రామనవమి పర్వదినాన్ని దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. మిథిలా స్టేడియంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భద్రాద్రికి వచ్చారు. ఈ సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవారికి ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్.నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు.

ప్రతి సంవత్సరము టీటీడీ తరుపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ముందుగా భద్రాచలం ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, ఈవో శ్రీమతి ఎల్ .రమాదేవి ఆలయ సాంప్రదాయాలతో స్వాగతం పలికారు. పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం టీటీడీ ఛైర్మన్ దంపతులు సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు. అంతకుముందు స్థానిక ఐటీసీ అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్ ను తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ శ్రీ జితేష్ పాటిల్ లు శాలువాలతో సత్కరించారు.

Share this post with your friends
Exit mobile version