Site icon Bhakthi TV

దర్శన క్యూలైన్లలో టీటీడీ చైర్మన్ తనిఖీలు.. 03 నాటికి జలాశయాల వివరాలు

తిరుమలలోని శ్రీవారి దర్శన క్యూలైన్లలో టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఏటీజీహెచ్ వద్దనున్న స్లాటెడ్ సర్వ దర్శన క్యూలైన్లను పరిశీలించి నారాయణగిరి షెడ్ల వద్దకు చేరుకున్నారు. అనంతరం ఫుట్ పాత్ హాల్ (దివ్యదర్శనం)ను తనిఖీ చేసి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ లో టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు లడ్డూలు రుచికరంగా, నాణ్యంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. మరికొందరు భక్తులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంలో తమకు దర్శనం మరింత త్వరగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని చైర్మన్ ను కోరారు. క్యూలైన్ల విధానం, దర్శన సమయం వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన ఏర్పాట్లు చేపడతామని తెలియజేశారు.

తిరుమలలో డిసెంబర్ 03 నాటికి జలాశయాల వివరాలు

తిరుమలలో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాల్లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ప్ర‌స్తుత నీటి నిల్వ‌లు తిరుమ‌ల‌కు 270 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి జలాశయాల నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.

1) పాపవినాశనం డ్యామ్ :- 697.00 మీ.
FRL :- 697.14 మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 5240.00 ల‌క్ష‌ల గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 5192.54 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

2) గోగర్భం డ్యామ్ :- 2894.00 అడుగులు
FRL :- 2894.00 అడుగులు
నిల్వ సామ‌ర్థ్యం :- 2833.00 ల‌క్ష‌ల గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 2833.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

3) ఆకాశగంగ డ్యామ్ :- 864.50 మీ
FRL :- 865.00 మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 685.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 645.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

4) కుమారధార డ్యామ్ :- 895.50.00 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 4258.98 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 3440.32 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

5) పసుపుధార డ్యామ్ :- 896.50 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 1287.51 ల‌క్ష‌ల గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 966.31 ల‌క్ష‌ల గ్యాలన్లు.

Share this post with your friends
Exit mobile version